kinnera mogulaiah: పేదోడిని.. మట్టి కొట్టకండి: కిన్నెర మొగిలయ్య ఆవేదన

నిరుపేదనైన తనను రాజకీయ వివాదాల్లోకి లాగి నష్టం కలిగించవద్దని 12 మెట్ల కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య ఆవేదనతో వేడుకున్నారు.

Updated : 19 May 2022 09:37 IST

అచ్చంపేట, న్యూస్‌టుడే: నిరుపేదనైన తనను రాజకీయ వివాదాల్లోకి లాగి నష్టం కలిగించవద్దని 12 మెట్ల కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య ఆవేదనతో వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటి స్థలంతో పాటు రూ. కోటి అందాయా అని ఇటీవల ఓ రాజకీయ పార్టీ నేత మొగిలయ్య వద్ద ప్రస్తావించారు. ఇంకా అందలేదని, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు ఇప్పించేందుకు కృషి చేస్తున్నారని మొగిలయ్య సమాధానమిచ్చారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడంతో మొగిలయ్య బుధవారం ఆ నాయకుడిని అచ్చంపేటలో రోడ్డుపైనే నిలదీశారు. అనంతరం విడుదల చేసిన మరో వీడియోలో మొగిలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాష్ట్రప్రభుత్వం అండగా నిలిచిందని స్పష్టం చేశారు. ఓ పార్టీ నేతలు తనకు పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ఇచ్చిందంటున్నారని, అవసరమైతే దాన్ని వాపసు ఇచ్చేయడానికైనా సిద్ధమేనన్నారు. ‘మీ రాజకీయాల కోసం నా నోట్లో మట్టి కొట్టవద్దని’ ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని