ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం..

భూమిలో కలిసిపోయే, నీటిలో కరిగిపోయే బయో డీగ్రేడబుల్‌ క్యారీ బ్యాగ్‌ల సాంకేతికతను రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి  బుధవారం పలు ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా అందజేశారు.

Published : 19 May 2022 05:27 IST

బయో డీగ్రేడబుల్‌ చేతి సంచులను అభివృద్ధి చేసిన ఏఎస్‌ఎల్‌
ప్రైవేటుకు సాంకేతికత బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌:  భూమిలో కలిసిపోయే, నీటిలో కరిగిపోయే బయో డీగ్రేడబుల్‌ క్యారీ బ్యాగ్‌ల సాంకేతికతను రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి  బుధవారం పలు ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా అందజేశారు. హైదరాబాద్‌ మిస్సైల్‌ కాంప్లెక్స్‌లోని అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ ల్యాబరేటరీ(ఏఎస్‌ఎల్‌)లో  నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్షిపణుల సాంకేతికతను అభివృద్ధి చేసే ఏఎస్‌ఎల్‌.. ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉన్న ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ సాంకేతికతను అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. తొలుత తిరుపతిలో బ్యాగ్‌ల పంపిణీని చేపట్టినా.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వినియోగంలో తీసుకురావాలని సాంకేతికతను ఉచితంగా బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. తొలుత 20 కంపెనీలకు ఇస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పీబీఏటీ బయోపాలీమర్స్‌కు మొక్కజొన్న పదార్థం కలపడం ద్వారా బయో డీగ్రేడబుల్‌ క్యారీ బ్యాగ్‌ల సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇందులోని బ్యాక్టీరియా కారణంగా భూమిపై పడగానే త్వరగా కుళ్లి మట్టిలో కలిసి ఎరువుగా మారుతుంది. నీటిలో వేస్తే 24 గంటల్లో కరిగిపోతాయి. ఇప్పుడున్న ప్లాస్టిక్‌ సంచుల తయారీ కంపెనీల్లోనే వీటిని ఉత్పత్తి చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని