‘మహిళా సంఘాలకు రూ. 18,070 కోట్ల రుణాలు’

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలని మంత్రి దయాకర్‌ రావు సూచించారు. 

Updated : 19 May 2022 06:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలని మంత్రి దయాకర్‌ రావు సూచించారు.  బుధవారమిక్కడ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘సెర్ప్‌’ వార్షిక ప్రణాళిక, బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2022-23 ఏడాదికి రూ.18,069.93 కోట్ల వార్షిక రుణప్రణాళికను సెర్ప్‌ నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని నిర్ణీత కాలవ్యవధిలో సాధించాలని, బ్యాంకులు వీలైనంత ఎక్కువ రుణాలను అందించాలని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని