Published : 19 May 2022 05:32 IST

ఏఎస్‌ఆర్టీయూ ఈడీగా సూర్యకిరణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సూర్యకిరణ్‌.. అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రజా రవాణా వ్యవస్థకు ఏఎస్‌ఆర్టీయూ మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన అధికారి జాతీయస్థాయి సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులు కావడం ఇదే తొలిసారి. సూర్యకిరణ్‌ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ బుధవారం సన్మానించారు. సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అభినందనలు తెలిపారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని