కరెంటు కొనుగోలులో 8.5% సంప్రదాయేతర ఇంధనం

సంప్రదాయేతర ఇంధనాన్ని(రెన్యూవబుల్‌ ఎనర్జీ-ఆర్‌ఈ) తప్పనిసరిగా కొనాలనే లక్ష్యసాధనకు అవసరమైతే ప్రజల ఇళ్లపై సౌర విద్యుత్‌ను సొంత ఖర్చుతో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లే ఏర్పాటు చేయాలని...

Published : 19 May 2022 05:32 IST

పంపిణీ సంస్థలకు ఈఆర్‌సీ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: సంప్రదాయేతర ఇంధనాన్ని(రెన్యూవబుల్‌ ఎనర్జీ-ఆర్‌ఈ) తప్పనిసరిగా కొనాలనే లక్ష్యసాధనకు అవసరమైతే ప్రజల ఇళ్లపై సౌర విద్యుత్‌ను సొంత ఖర్చుతో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లే ఏర్పాటు చేయాలని ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’(ఈఆర్‌సీ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఇంధన విధానం-2016లో భాగంగా ఆర్‌ఈ ఉత్పత్తి, వినియోగాన్ని బాగా ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం విద్యుత్‌ చట్టం-2003 సెక్షన్‌ 86(1) ప్రకారం ప్రతి డిస్కం ఏటా కొనుగోలు చేసే మొత్తం కరెంటులో ఎంత ఆర్‌ఈ ఉండాలనేది రాష్ట్ర ఈఆర్‌సీ నిర్ణయించాలని కేంద్ర విద్యుత్‌శాఖ ఆదేశించింది. దీన్ని ‘విధిగా సంప్రదాయేతర ఇంధన కొనుగోలు’(రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌-ఆర్‌పీపీఓ) అని పిలుస్తారు. అంటే దేశవ్యాప్తంగా ప్రతి డిస్కం విధిగా ఆర్‌ఈని కొనాలి. ఈ ఏడాది(2022-23)లో మొత్తం కరెంటు కొనుగోళ్లలో ఆర్‌పీపీఓ 8.5 శాతం ఉండాలని.. ఈ 8.5 శాతంలో 7.50 శాతం సౌరవిద్యుత్‌ మాత్రమే ఉండాలని ఈఆర్‌సీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో సౌరవిద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి.. ఆర్‌పీపీఓ లక్ష్యం ప్రకారం కొనుగోలుకు అనుకూలంగా ఉన్నందున డిస్కంలు సొంత ఖర్చుతో ఇళ్లు, ఇతర భవనాలపై సౌరవిద్యుత్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం రాకపోవచ్చని విద్యుత్‌ వర్గాల అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని