‘ఇష్టపూర్వకంగా’.. బలవంతపు ఒప్పందాలు!

మిల్లర్ల వద్ద ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తామే బాధ్యులం అంటూ ఓ కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ముందస్తు ఒప్పంద పత్రాలు తీసుకుంటున్నారు.

Published : 19 May 2022 06:57 IST

కొనుగోలు కేంద్రాల వద్ద  రైతుల నుంచి పత్రాల స్వీకరణ
అన్నదాతల ఆందోళన

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: మిల్లర్ల వద్ద ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తామే బాధ్యులం అంటూ ఓ కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ముందస్తు ఒప్పంద పత్రాలు తీసుకుంటున్నారు. ఈ విధానంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలోని ఓ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ‘మీ కేంద్రంలోకి మేం వరిధాన్యం తీసుకువచ్చాం. మిషన్‌ ద్వారా ధాన్యం పట్టడానికి వీలు పడటం లేదు. మిల్లరు వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. భరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మా ధాన్యాన్ని తూకం వేసి పంపించగలరు. నా ధాన్యంపై ఎవరు మాట్లాడినా నేనే బాధ్యుడిని. ఇది నా ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నాను’’ అని రైతులతో బలవంతంగా సంతకాలు చేయిస్తూ ఒప్పంద పత్రాలు తీసుకుంటున్నారు. ఈ ఒప్పంద పత్రాలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని