Published : 19 May 2022 05:38 IST

తిమ్మక్కను మించిన దేశభక్తులు ఉండరు

‘వృక్షమాత’కు సీఎం కేసీఆర్‌ సన్మానం

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటకకు చెందిన వృక్షమాత, పద్మశ్రీ పురస్కార గ్రహీత సాలుమరద తిమ్మక్క (111)ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఘనంగా సత్కరించారు. తనను కలిసేందుకు వచ్చిన ఆమెను పల్లె, పట్టణ ప్రగతి సమీక్ష సమావేశానికి కేసీఆర్‌ స్వయంగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వృక్ష సంరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. హరితహారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్న పర్యావరణ కృషిపై.. సాహిత్య అకాడమీ ఛైౖర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం.. ‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. తొలి కాపీని తిమ్మక్కకు అందజేశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి పంచనారసింహుల స్వయంభూ క్షేత్రాన్ని తిమ్మక్క బుధవారం దర్శించుకున్నారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని