జూన్‌ 20లోపే ఇంటర్‌ ఫలితాలు

ఇంటర్మీడియట్‌ ఫలితాలు జూన్‌ 20వ తేదీలోపే వెల్లడికానున్నాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు గురువారంతో ముగిశాయి. జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 12న మొదలైంది. ఈసారి

Updated : 20 May 2022 05:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాలు జూన్‌ 20వ తేదీలోపే వెల్లడికానున్నాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు గురువారంతో ముగిశాయి. జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 12న మొదలైంది. ఈసారి కొత్తగా నిర్మల్‌, మంచిర్యాల, సిద్దిపేటలలో స్పాట్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 15 వేల మంది మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. బోర్డు కార్యదర్శి జలీల్‌ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటినుంచి నెలలోగా ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ప్రశ్నపత్రాల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, వచ్చే ఏడాది తప్పులు జరగకుండా చూస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని