అరగంట ముందుగా డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ నంబరు!

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వెసులుబాటు కల్పించింది. బస్సులు బయలుదేరడానికి అరగంట ముందుగా డ్రైవర్‌ నంబరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించింది. డ్రైవర్‌

Updated : 20 May 2022 05:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వెసులుబాటు కల్పించింది. బస్సులు బయలుదేరడానికి అరగంట ముందుగా డ్రైవర్‌ నంబరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించింది. డ్రైవర్‌ నంబరు అందుబాటులో లేకపోవటంతో బస్సు ఎక్కడ ఉంది? సరైన సమయానికి వస్తుందా? లేక ఆలస్యమవుతుందా? తదితర సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. టికెట్‌ బుకింగ్‌ కోసం ఓపీఆర్‌ఎస్‌ పేరిట సాఫ్ట్‌వేర్‌ను ఆర్టీసీ వినియోగిస్తుంది. ఇందులో డ్రైవర్‌ నంబరు అందుబాటులో లేదంటూ కాల్‌ సెంటర్‌కు రోజూ ఎక్కువ కాల్స్‌ రావడంతో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని