‘కొత్త చట్టం’ అమలును నిలిపివేయాలి

ఆటో సంఘాల ఐకాస ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మోటారు వాహనాల చట్టం-2019 అమలును నిలిపివేయాలని, ఫిట్‌నెస్‌ లేని ఆటోలకు రోజుకు రూ.50 చొప్పున విధిస్తున్న జరిమానాను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. రవాణా కార్యాలయం వద్ద సంఘాల ప్రతినిధులు అధికారులను కలిసి వచ్చిన తర్వాత పోలీసులు నిలువరించినా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. వారిని

Updated : 20 May 2022 05:38 IST

రవాణా కార్యాలయాన్ని ముట్టడించిన ఆటో కార్మిక సంఘాలు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఆటో సంఘాల ఐకాస ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మోటారు వాహనాల చట్టం-2019 అమలును నిలిపివేయాలని, ఫిట్‌నెస్‌ లేని ఆటోలకు రోజుకు రూ.50 చొప్పున విధిస్తున్న జరిమానాను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. రవాణా కార్యాలయం వద్ద సంఘాల ప్రతినిధులు అధికారులను కలిసి వచ్చిన తర్వాత పోలీసులు నిలువరించినా కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల నేతలు బి.వెంకటేశ్‌, ఎ.సత్తిరెడ్డి, కిరణ్‌, అమానుల్లాఖాన్‌ తదితరులు మాట్లాడుతూ.. రవాణా రంగ కార్మికుల నడ్డివిరుస్తున్న చట్టం అమలును ఆపకపోతే ప్రగతిభవన్‌నూ ముట్టడిస్తామని హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరగడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇంధన అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని ఆటో కనీస ఛార్జీని రూ.20 నుంచి రూ.40కి, ఆపై కిలోమీటరుకు ఛార్జీని రూ.11 నుంచి రూ.25కు పెంచాలని కోరారు. హైదరాబాద్‌లో నిరుద్యోగులైన బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కోసం కొత్త ఆటో పర్మిట్లు మంజూరు చేయాలని, బీమా ధరలు తగ్గించాలన్నారు. ఆటో, ట్రాలీ, క్యాబ్‌, లారీ, ప్రైవేట్‌ బస్సు కార్మికులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వారి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని