Updated : 12 Oct 2021 07:13 IST

TS News: నల్గొండ ఎమ్మెల్యే వేధిస్తున్నారు: మహిళా సర్పంచి ఆరోపణ

పదవికి రాజీనామా చేస్తూ కలెక్టర్‌కు లేఖ

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తనను వేధింపులకు గురిచేస్తున్నారని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం గ్రామ సర్పంచి గాదె సంధ్య ఆరోపించారు. అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ లేఖను సోమవారం కలెక్టర్‌కు అందజేసేందుకు రాగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్‌ ఏవో మోతీలాల్‌కు అందజేశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఒత్తిడి, ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకనే సర్పంచి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తాను అధికార పార్టీలో చేరకపోవడంతో ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. గ్రామాభివృద్ధి పనులను సకాలంలో చేయడం చేతకాక.. తనపై సర్పంచి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts