Updated : 23 Nov 2021 08:04 IST

Disha Case: ‘దిశ నిందితుల్లో మైనర్లు లేరు’

సిర్పుర్కర్‌ కమిషన్‌ ముందు ఏసీపీ న్యాయవాది

ఈనాడు, హైదరాబాద్‌: దిశ నిందితుల్లో ఎవరూ మైనర్లు లేరని ఏసీపీ సురేందర్‌ రెడ్డి తరఫు న్యాయవాది కీర్తి కిరణ్‌ కోటా పేర్కొన్నారు. వారికి సంబంధించిన రికార్డులు అన్నింటిలోనూ మేజర్లే అని ఉన్నట్లు వెల్లడించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ ఎదుట సోమవారం ఆయన వాదనలు వినిపించారు. వారు మైనర్లు అని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, కొన్ని చోట్ల ఇంకుతో దిద్దినట్లు కూడా ఉందని, ఈ విషయాన్ని గమనించాలన్నారు. నిందితులు కాల్పులు జరపడంతో గత్యంతరం లేని స్థితిలోనే పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదిస్తూ దిశ అత్యాచారం జరిగినప్పటి నుంచి ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. వారిని అరెస్టు చేసినప్పుడు షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు 40వేల మంది ప్రజలు చేరుకున్నారని, నిందితులను తమ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారన్నారు. చివరకు చర్లపల్లి జైలుకు తరలించినప్పుడు కూడా అక్కడకీ జనం చేరుకున్నారని, అందుకే వారికి హాని కలగకూడదనే ఉద్దేశంతోనే సేఫ్‌హౌస్‌లో ఉంచారని కమిషన్‌కు తెలిపారు. ప్రజల దృష్టిలో పడకూడదనే ఆలోచనతోనే తెల్లవారుజామున నేరస్థలానికి తీసుకెళ్లారని తెలిపారు. సాక్షులు, లారీ యజమాని చెప్పిన వివరాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారని తెలిపారు. అనంతరం విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని