Hyderabad News: హిమగిరుల్లోనే కాదు.. హైదరాబాద్‌ చెంతా రుద్రాక్ష

సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో, శీతల ప్రాంతాల్లోనే కనిపించే రుద్రాక్ష మొక్కలను హైదరాబాద్‌ శివారులో ఓ రైతు పెంచుతున్నారు. మహేశ్వరం మండల పరిధిలోని అమీర్‌పేట్‌లో హరిబాబు అనే రైతు పదెకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. దీంతో పాటు ఆరేళ్లుగా నాలుగు రుద్రాక్ష మొక్కలను సైతం పెంచుతున్నారు. మొక్కలపై ఎండ పడకుండా ఉండేందుకు చెట్ల మధ్య గ్రీన్‌మ్యాట్‌ కట్టి వాటిని రక్షిస్తున్నారు. మూడు చెట్లకు మూడేళ్లుగా రుద్రాక్షలు కాస్తున్నాయని, వేడి ప్రాంతాల్లో రుద్రాక్ష మొక్కలు

Updated : 30 Dec 2021 08:14 IST

ముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో, శీతల ప్రాంతాల్లోనే కనిపించే రుద్రాక్ష మొక్కలను హైదరాబాద్‌ శివారులో ఓ రైతు పెంచుతున్నారు. మహేశ్వరం మండల పరిధిలోని అమీర్‌పేట్‌లో హరిబాబు అనే రైతు పదెకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. దీంతో పాటు ఆరేళ్లుగా నాలుగు రుద్రాక్ష మొక్కలను సైతం పెంచుతున్నారు. మొక్కలపై ఎండ పడకుండా ఉండేందుకు చెట్ల మధ్య గ్రీన్‌మ్యాట్‌ కట్టి వాటిని రక్షిస్తున్నారు. మూడు చెట్లకు మూడేళ్లుగా రుద్రాక్షలు కాస్తున్నాయని, వేడి ప్రాంతాల్లో రుద్రాక్ష మొక్కలు పెరగడం అరుదని ఆ రైతు చెబుతున్నారు.

-ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని