Published : 27/11/2021 07:34 IST

Weather Forecast: నేడూ రేపూ తెలంగాణలో మోస్తరు.. రాయలసీమలో భారీ వర్షాలు!

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: బంగాళాఖాతంలో అండమాన్‌ దీవులకు దక్షిణంగా ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఆ తరవాత అది బలపడి పశ్చిమ, వాయువ్య దిశగా కదిలే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్‌జిల్లా సల్కాపూర్‌లో 12.9డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో శనివారం భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని