TS News: రోడ్డుపై గుట్టలుగా కరెన్సీ నోట్ల తుక్కు

నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ జాతీయ రహదారిపై బుధవారం చిరిగిన కరెన్సీ (నోట్ల తుక్కు) కుప్పలుకుప్పలుగా కనిపించడం కలకలం రేపింది.

Updated : 30 Dec 2021 06:43 IST

నిజామాబాద్‌ జిల్లాలో కలకలం

రహదారి పక్కన దొరికిన నోట్ల తుక్కు

నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ జాతీయ రహదారిపై బుధవారం చిరిగిన కరెన్సీ (నోట్ల తుక్కు) కుప్పలుకుప్పలుగా కనిపించడం కలకలం రేపింది. లారీ నుంచి కింద పడిన సంచి పైనుంచి వాహనాలు వెళ్లడంతో తుక్కు రోడ్డుపై చెల్లాచెదురుగా పడినట్టు స్థానికులు చెబుతున్నారు. అవి అసలైనవా? నకిలీ నోట్లా? అసలైనవైతే తుక్కుగా ఎందుకు మార్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ‘సాధారణంగా ఆర్‌బీఐ పాత నోట్లను ధ్వంసం చేసే క్రమంలో రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది తప్ప ఇలా తరలించదు. దీన్నిబట్టి అది నల్లధనమో లేదా నకిలీ నోట్లో అయ్యే అవకాశం ఉంది. ఏ వాహనం నుంచి అవి జారిపడ్డాయో తెలుసుకునేందుకు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నాం’ అని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి వెల్లడించారు.

- న్యూస్‌టుడే, కమ్మర్‌పల్లి, మెండోరా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని