10th Exams: మే 11 నుంచి పది పరీక్షలు

రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మే 11 నుంచి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) పంపిన కాలపట్టికకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం

Updated : 12 Feb 2022 05:04 IST

17వ తేదీతో ప్రధాన పరీక్షలు పూర్తి

కాలపట్టికను ప్రకటించిన ప్రభుత్వ పరీక్షల విభాగం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మే 11 నుంచి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) పంపిన కాలపట్టికకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఆమోదం తెలిపిన వెంటనే బోర్డు సంచాలకుడు కృష్ణారావు దానిని విడుదల చేశారు. పరీక్షలు పూర్తిగా మే 20తో ముగుస్తాయి. ఆరు ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు 17తోనే పూర్తవుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్కో పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలకు 60; ఆబ్జెక్టివ్‌ పేపర్‌కు(పార్ట్‌ ‘బి’కి) 20 మార్కులు ఉంటాయి. పార్ట్‌ ‘బి’లోని ప్రశ్నలకు చివరి అర గంటలో మాత్రమే సమాధానాలు రాయాలి. ఈ 80 పోను మిగిలిన 20 మార్కులను అంతర్గత పరీక్షలు, ఎసైన్‌మెంట్లు తదితరాల ఆధారంగా కేటాయిస్తారు.

ఆరు పరీక్షలు... ఏడు పేపర్లు

సాధారణ పరిస్థితుల్లో ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లు ఉండేవి.  హిందీకి తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు రెండేసి పేపర్లతో మొత్తం 11 రోజులు పరీక్షలు నిర్వహించేవారు. కరోనా నేపథ్యంలో సిలబస్‌ను తగ్గించడంతోపాటు ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపర్‌ ఉండేలా గతంలో నిర్ణయించారు. సైన్స్‌లో మాత్రం భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలకు వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇస్తారు. ఒక రోజే పరీక్ష ఉంటుంది. సమాధానాలను వేర్వేరు జవాబుపత్రాలపై రాయాలి. ఆ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు వేరుగా ఉండటం వల్ల జవాబుపత్రాల మూల్యాంకనంలో సమస్య ఉత్పన్నమవుతుందని రెండు ప్రశ్నపత్రాలు ఇస్తున్నారు. ఒక్కో దానికి 40 చొప్పున మార్కులు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని