KGBV: అందుబాటులోకి మరో 16 కేజీబీవీలు

రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం(2024-25) కొత్తగా 16 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) అందుబాటులోకి వచ్చాయి.

Published : 22 Jun 2024 04:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం(2024-25) కొత్తగా 16 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి 2022-23 విద్యాసంవత్సరమే 20 కేజీబీవీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిన 13 నెలల తర్వాత గత సంవత్సరం సెప్టెంబరులో పచ్చజెండా ఊపింది. దీంతో ఆ ఏడాది నాలుగింటిని మాత్రమే ప్రారంభించారు. తాజాగా మిగిలిన 16 విద్యాలయాలను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ మల్లయ్య బట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని