DSC: డీఎస్సీకి 2,79,956 దరఖాస్తులు

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి వచ్చే నెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్న డీఎస్సీకి 2,79,956 దరఖాస్తులు అందాయి.

Published : 22 Jun 2024 06:45 IST

అభ్యర్థులు 2 లక్షల మంది ఉండొచ్చని అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి వచ్చే నెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్న డీఎస్సీకి 2,79,956 దరఖాస్తులు అందాయి. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. డీఈడీ, బీఈడీ పూర్తిచేసి టెట్‌ ఉత్తీర్ణులైన వారు  సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ).. రెండు పోస్టులకు దరఖాస్తు చేస్తారు. బీఈడీ పూర్తిచేసి టెట్‌ పాసైన వారు ఎస్‌ఏలోనే రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రకారం డీఎస్సీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య 2 లక్షల వరకే ఉంటుందని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లా నుంచి 27,027, తర్వాత నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు అందాయి. నాన్‌లోకల్‌ కోటా(5 శాతం) కింద ఇతర జిల్లాల వారు సైతం హైదరాబాద్‌ జిల్లాలో పెద్దఎత్తున   దరఖాస్తు చేయడంతో ఆ జిల్లాలో అధికంగా అందాయని భావిస్తున్నారు. అతి తక్కువగా మేడ్చల్‌ జిల్లా నుంచి 2,265, ఆ తర్వాత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 23,919 మంది ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని