Chitra Ramkrishna: కో-లొకేషన్‌ కేసులో చిత్రా రామకృష్ణ అరెస్ట్‌

కో-లొకేషన్‌ కుంభకోణం కేసులో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం అరెస్ట్‌ చేసింది. దిల్లీలో ఆమెను అదుపులోకి తీసుకున్న సీబీఐ... వైద్య

Updated : 07 Mar 2022 10:29 IST

దిల్లీ: కో-లొకేషన్‌ కుంభకోణం కేసులో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం అరెస్ట్‌ చేసింది. దిల్లీలో ఆమెను అదుపులోకి తీసుకున్న సీబీఐ... వైద్య పరీక్షల అనంతరం ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లింది. వరుసగా మూడు రోజుల పాటు చిత్రా రామకృష్ణను విచారించిన సీబీఐ, అదే సమయంలో ఆమె ఇంటిలో సోదాలు జరిపింది. విచారణలో  సరిగ్గా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. చిత్రాను విచారించడానికి కేంద్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ సీనియర్‌ సైకాలజిస్ట్‌ సేవలను సైతం వినియోగించింది. ఆమె సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని సైకాలజిస్ట్‌ నిర్ధారించిన తర్వాత, అరెస్ట్‌ చేయక తప్పలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. చిత్రా ముందస్తు బెయిల్‌ను శనివారం ప్రత్యేక సీబీఐ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 2018 ప్రారంభం నుంచి కో-లొకేషన్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సెబీ నివేదికతో సీబీఐ చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 25న ఎన్‌ఎస్‌ఈ మాజీ గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి విదితమే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు