Telangana Budget 2022: మెట్రోకు మెరుపులు

రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.2,377 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఇంత భారీమొత్తంలో నిధులను ప్రతిపాదించడం ఇదే మొదటిసారి. ఏటా రూ.200-500 కోట్లనే కేటాయించేవారు. 2021-22 బడ్జెట్‌లో రూ.1,000 కోట్లను ప్రతిపాదించినా..

Updated : 08 Mar 2022 05:34 IST

 మొత్తం రూ.2,377 కోట్ల కేటాయింపు

పాతబస్తీతో అనుసంధానానికి రూ.500 కోట్లు

రాయదుర్గం-శంషాబాద్‌ మార్గానికి రూ.377 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రో రైలు ప్రాజెక్టులకు రూ.2,377 కోట్లు కేటాయించారు. గత పదేళ్లలో ఇంత భారీమొత్తంలో నిధులను ప్రతిపాదించడం ఇదే మొదటిసారి. ఏటా రూ.200-500 కోట్లనే కేటాయించేవారు. 2021-22 బడ్జెట్‌లో రూ.1,000 కోట్లను ప్రతిపాదించినా.. రూ.200 కోట్లకు మించి మంజూరు చేయలేదు. తాజా బడ్జెట్‌లో హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లతో పాటు అదనంగా పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు, రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రతిపాదిత 31 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు రూ.377.35 కోట్లుగా కేటాయించారు.

పాతబస్తీలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మిగిలిపోయిన 5.5 కి.మీ. మెట్రో మార్గాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. వారసత్వ కట్టడాలు, ప్రార్థనా స్థలాలతో అవాంతరాలు చోటుచేసుకున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకునేందుకే!

కొవిడ్‌ కారణంగా మెట్రో రైలు తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయింది. నష్టాలు రూ.2 వేల కోట్లను దాటాయి. 2022-23 బడ్జెట్‌లో మెట్రో ప్రాజెక్టుకు రూ.1500 కోట్లను ప్రతిపాదించారు. ఈ మొత్తం ఎల్‌ అండ్‌ టీని ఆదుకునేందుకేనన్న ప్రచారం ఉంది. నిధుల కేటాయింపుపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని