Puneet Rajkumar: ప్రభుత్వ లాంఛనాలతో పునీత్‌ అంత్యక్రియలు

గుండెపోటుతో శుక్రవారం కన్నుమూసిన కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌(46) అంత్యక్రియలు ఆదివారం ఉదయం ముగిశాయి. తల్లిదండ్రులు పార్వతమ్మ...

Updated : 01 Nov 2021 09:50 IST

పునీత్‌ పార్థివదేహం నుదుటిపై ముద్దాడుతున్న సీఎం బసవరాజ బొమ్మై

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: గుండెపోటుతో శుక్రవారం కన్నుమూసిన కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌(46) అంత్యక్రియలు ఆదివారం ఉదయం ముగిశాయి. తల్లిదండ్రులు పార్వతమ్మ, రాజ్‌కుమార్‌ల సమాధి పక్కనే ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వేకువజామున వరకు కంఠీరవ స్టేడియంలో లక్షలాది మంది తమ అభిమాన నటుడ్ని కడసారి చూసుకున్నారు. అనుకున్న సమయం కన్నా ముందుగా ఉదయం 5.30 గంటలకే భౌతికకాయాన్ని కంఠీరవ స్టూడియోకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు. స్టేడియం నుంచి స్టూడియోకు గంటలోనే భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. పునీత్‌ బాలుడిగా ఉన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై తన భావోద్వేగాన్ని దాచుకోలేకపోయారు. భౌతికకాయం నుదుటిపై ముద్దాడారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం మూడు రౌండ్లు గాల్లోకి పోలీసులు కాల్పులు జరిపారు. జాతీయ పతాకాన్ని పునీత్‌ భార్యకు ముఖ్యమంత్రి అప్పగించారు. పునీత్‌ అన్న కుమారుడు వినయ్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, మంత్రులు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని