KTR: రామారావు గారూ బాగున్నారా?

‘‘రామారావు గారూ బాగున్నారా’’ అంటూ పారిస్‌లోని లక్సెంబర్గ్‌ ప్యాలెస్‌లో ఆదివారం అచ్చమైన తెలుగులో ఆత్మీయ పలకరింపు విని ఆశ్చర్యపోయారు మంత్రి ....

Updated : 01 Nov 2021 14:01 IST

పారిస్‌లో మంత్రి కేటీఆర్‌కు తెలుగులో ఆత్మీయ పలకరింపు

పారిస్‌లో మంత్రి కేటీఆర్‌తో తెలుగు భాషాభిమాని, పరిశోధకుడు డేనియల్‌ నెగ్గర్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘రామారావు గారూ బాగున్నారా’’ అంటూ పారిస్‌లోని లక్సెంబర్గ్‌ ప్యాలెస్‌లో ఆదివారం అచ్చమైన తెలుగులో ఆత్మీయ పలకరింపు విని ఆశ్చర్యపోయారు మంత్రి కేటీఆర్‌. అక్కడ తెలుగు వారు ఎవరా అని మంత్రి చూస్తుండగా.. ‘రామారావు గారూ! నేనే మాట్లాడేది’ అంటూ ఒక ఫ్రాన్స్‌ జాతీయుడు ఆయన దగ్గరికి రావడంతో కేటీఆర్‌ విస్మయం చెందారు. ‘‘నా పేరు ప్రొఫెసర్‌ డేనియల్‌ నెగ్గర్స్‌. నాకు చిన్నప్పటి నుంచి తెలుగంటే ఎంతో అభిమానం. పలుమార్లు తెలుగు రాష్ట్రాలను సందర్శించా. మీ భాష నేర్చుకుని ఫ్రాన్స్‌ విశ్వవిద్యాలయంలోని జాతీయ ప్రాచ్య భాషా సంస్కృతుల సంస్థలో దక్షిణాసియా హిమాలయ అధ్యయన విభాగంలో మూడు దశాబ్దాలుగా పరిశోధన చేస్తున్నా’’ అని ఆయన వివరించారు. ఆయన కృషిని మెచ్చుకున్న కేటీఆర్‌.. దాదాపు అరగంట సమయం ఆయనతో మాట్లాడారు. త్వరలో హైదరాబాద్‌ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని ఆహ్వానించారు. పోచంపల్లి శాలువాతో సత్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని