Basara: భక్తజనంతో మురిసిన బాసర

దశమి, ఏకాదశి కలిసి రావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు.

Published : 17 Jun 2024 04:43 IST

1400 అక్షరాభ్యాసాలు, రూ.15 లక్షల ఆదాయం

 

అక్షరాభ్యాస మండపంలో భక్తులు

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: దశమి, ఏకాదశి కలిసి రావడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనం, అక్షరాభ్యాసాల కోసం సుమారు అయిదు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. మంచి ముహూర్తం ఉండటంతో అఖిల భారతీయస్వామి, సమర్థ గురుపీఠం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సామూహిక అక్షరాభ్యాసాలు చేయించారు. వరుసలో ఉన్న చిన్నారులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ విజయరామారావు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. 1400 అక్షరాభ్యాసాలు జరిగాయని, ఆలయానికి రూ.15 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయాధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు