Hanumakonda: జాతిపితపై అభిమానం.. ఇంటి ప్రహరీపై విగ్రహం

మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు దేశానికి చేసిన సేవలను భావితరాలు గుర్తుంచుకునేలా వారి విగ్రహాలను ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయడం సర్వసాధారణమే.

Updated : 17 Jun 2024 09:17 IST

మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు దేశానికి చేసిన సేవలను భావితరాలు గుర్తుంచుకునేలా వారి విగ్రహాలను ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయడం సర్వసాధారణమే. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌ గ్రామానికి చెందిన నాగోతు బాలజోజి మాత్రం.. బాపూజీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేలా ఇంటి ప్రహరీపై రూ.30 వేల వ్యయంతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆదర్శంగా నిలిచారు. ‘తన తండ్రి రాయన్న 60 ఏళ్ల క్రితం ఇంట్లోనే గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బాల్యంలో ఉండగా స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం, దేశభక్తి గురించి నాన్న చెప్పే వారు. దాంతో మహాత్మునిపై అభిమానం రెట్టింపైంది. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో దాన్ని కూల్చేసి అదే స్థలంలో కొత్త ఇంటిని నిర్మించుకున్నాం. గాంధీ విగ్రహం ఉన్న చోటే మరింత పెద్దగా మరోటి ఏర్పాటు చేశాం’ అని బాలజోజి వివరించారు. ఏటా ఆగస్టు 15న, అక్టోబరు 2న విగ్రహం వద్ద వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈనాడు, హనుమకొండ, న్యూస్‌టుడే, చెన్నారావుపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని