Bandi Sanjay: హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా నియమితులైన బండి సంజయ్‌ గురువారం దిల్లీ నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

Published : 14 Jun 2024 03:13 IST

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా నియమితులైన బండి సంజయ్‌ గురువారం దిల్లీ నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ సమక్షంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్, కార్యదర్శి అజయ్‌భల్లా కూడా పాల్గొన్నారు. తర్వాత సంజయ్‌.. కిషన్‌రెడ్డి దగ్గరకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భాజపా కార్యకర్తలు, నాయకులు ఇద్దరు మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని