mancherial: చనిపోయిన నాలుగేళ్లకు ఉద్యోగ చివరి పరీక్షకు పిలుపు

ఓ అభ్యర్థి చనిపోయిన నాలుగేళ్ల తరువాత ఉద్యోగ చివరి పరీక్షకు హాజరు కావాలని కాల్‌ లెటర్‌ వచ్చింది. ఇది శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటుచేసుకుంది.

Updated : 22 Jun 2024 05:58 IST

2020లోనే ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం

మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే: ఓ అభ్యర్థి చనిపోయిన నాలుగేళ్ల తరువాత ఉద్యోగ చివరి పరీక్షకు హాజరు కావాలని కాల్‌ లెటర్‌ వచ్చింది. ఇది శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటుచేసుకుంది. వివరాలివీ... ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ కోసం 2018లో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. మిగులు పోస్టుల భర్తీ విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. మెరిట్‌ ప్రకారం నియామకాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మందమర్రికి చెందిన జీవన్‌కుమార్‌కు విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్షకు ఈ నెల 24న హాజరుకావాలని కాల్‌లెటర్‌ వచ్చింది. కానీ అతను మరణించడంతో పోస్ట్‌మ్యాన్‌ దానిని తిరిగి వెనక్కి పంపించారు. 

కుటుంబంలో మిగిలింది ఒక్కరే: మందమర్రి మొదటిజోన్‌కు చెందిన సిద్దెంకి మొండయ్య-సరోజ దంపతులకు నవీన్‌కుమార్, అనూష, ఆదిత్య, జీవన్‌కుమార్‌ సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. జీవన్‌కుమార్‌(24) 2014లో ఐటీఐ పూర్తి చేశారు. అనారోగ్యంతో అక్క ఆదిత్య (2018లో), తల్లి సరోజ (జనవరి, 2019లో) మరణించారు. ఉద్యోగం రాకపోవడంతో జీవన్‌కుమార్‌ 2020 మార్చి 15న ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అనంతరం అక్క అనూష, తండ్రి మొండయ్య చనిపోయారు. ప్రస్తుతం పెద్దకొడుకు నవీన్‌ ఒక్కరే మిగిలారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని