CM KCR: దిల్లీ నుంచి తిరిగి వచ్చిన సీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల దిల్లీ పర్యటనను ముగించుకొని బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి

Updated : 25 Nov 2021 05:09 IST

ప్రధాని మోదీతో భేటీకి లభించని అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల దిల్లీ పర్యటనను ముగించుకొని బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. యాసంగిలో ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం దిల్లీకి వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సోమ, మంగళవారాల్లో కలిసేందుకు సీఎం కార్యాలయం అనుమతి కోరినా లభించలేదని తెలిసింది. బుధవారం ప్రధానితో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ ఉండటంతో కేసీఆర్‌కి అవకాశం లభించలేదని సమాచారం. రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, కేంద్ర వ్యవసాయ  మంత్రి తోమర్‌లతో మంగళవారం సాయంత్రం భేటీ అయింది.  ఈ సందర్భంగా ధాన్యం సేకరణపై వారు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ నెల 26వ తేదీన మరోసారి రావాలని కేంద్ర మంత్రులు సూచించారు. మరోవైపు ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాల ధృష్ట్యా మరికొన్ని రోజులు ప్రధానితో భేటీకి అవకాశం లేదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ దిల్లీ నుంచి తిరిగివచ్చారు. మంత్రులు ఈ నెల 26న మళ్లీ దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. అనంతరం సీఎం కేసీఆర్‌ తదుపరి కార్యాచరణను ప్రకటించే వీలున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని