CM Revanth: జయశంకర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు ఆచార్య జయశంకర్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు.

Updated : 22 Jun 2024 05:32 IST

ఆచార్య జయశంకర్‌ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు ఆచార్య జయశంకర్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో జయశంకర్‌ చిత్రపటానికి శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండ ప్రకాశ్, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభాష్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు నివాళులు అర్పించారు. 

తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత జయశంకర్‌ అని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ‘మీ స్ఫూర్తిని చెదరకుండా మా గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నామ’ని ఆయన నివాళులర్పించారు.

సీఎంతో దక్షిణ కొరియా రాయబారి భేటీ

హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో దక్షిణ కొరియా రాయబారి హెచ్‌.ఈ.చాంగ్‌ జే-బోక్‌ బృందం శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో దక్షిణ కొరియా వాణిజ్య వ్యవహారాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని