CPGET: జులై 6 నుంచి 15 వరకు సీపీగెట్‌

రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి జులై 6 నుంచి 15 వరకు కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌) నిర్వహించనున్నారు.

Published : 22 Jun 2024 04:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి జులై 6 నుంచి 15 వరకు కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌) నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం సీపీగెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి సబ్జెక్టుల వారీగా ఆన్‌లైన్‌ విధానంలో జరిగే పరీక్షల తేదీలను వెల్లడించారు. మొత్తం 45 సబ్జెక్టులకు గాను రోజుకు మూడు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్‌ ఆర్ట్స్, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌కు పరీక్షలు ఉండవని కన్వీనర్‌ తెలిపారు. శుక్రవారం నాటికి 71 వేల మంది దరఖాస్తు చేశారన్నారు. అభ్యర్థులు జులై 3వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని