Hyderabad: మురుగుతో కూరగాయలు.. తింటే రోగాలు

చూసేందుకు పచ్చగా, ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ పంట మురుగు నీటితో పండించింది. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్, పీర్జాదిగూడల్లో ఉప్పల్‌ నల్లచెరువు, మూసీ పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే కలుషిత నీటితో పంటలు సాగు చేస్తున్నారు.

Updated : 24 Jun 2024 07:44 IST

చూసేందుకు పచ్చగా, ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ పంట మురుగు నీటితో పండించింది. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్, పీర్జాదిగూడల్లో ఉప్పల్‌ నల్లచెరువు, మూసీ పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే కలుషిత నీటితో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆకుకూరలు ఉంటున్నాయి. ఇవి నగరవ్యాప్తంగా మార్కెట్లకు వస్తుంటాయి. మూసీ నీటితో పండించిన కూరగాయలు, ఆకుకూరల్లో ప్రమాదకర ఆర్సెనిక్, లెడ్, క్యాడ్మియం వంటి రసాయనాల అవశేషాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి తింటే రోగాల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల హైకోర్టు కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇలాంటి పంటల సాగుపై నియంత్రణ ఉండటం లేదు.                            

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని