Yadadri: తిరుమల తరహాలో యాదాద్రి స్వయంభువుల దర్శనం

తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభువుల దర్శనం కలగనుంది. దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకొంటూ..

Published : 07 Jul 2024 03:41 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: తిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభువుల దర్శనం కలగనుంది. దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకొంటూ.. గర్భగుడి చెంతకు చేరేలా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్‌రావు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సూచన మేరకు స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి తీర్థంతో పాటు శఠారి ఆశీర్వాదం ఇవ్వనున్నారు. 14వ తేదీన వనమహోత్సవం పేరిట క్షేత్ర పరిధిలో రెండు వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేపట్టారు. 15వ తేదీ ఉదయం 6.05 నిమిషాలకు సామూహిక ‘గిరి ప్రదక్షిణ’ నిర్వహిస్తున్నామని వివరించారు. కొత్త నిత్యాన్నప్రసాద భవనాన్ని శ్రావణమాసం తొలివారంలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు పశ్చిమ గోపురం నుంచి నేరుగా దైవదర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై కొండ కింది నుంచి వచ్చే వారికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష చేసేందుకు ఆదేశించామని ఆలయ ఈవో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని