ChatGPT in Telugu: తెలుగులో చాట్‌జీపీటీ తయారీకి డేటాథాన్‌

తెలుగులో చాట్‌ జీపీటీ తయారీకి అవసరమైన తెలుగు భాష డేటా సెట్స్‌ సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 10న డేటాథాన్‌ సదస్సు నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ తెలిపింది.

Published : 09 Jul 2024 03:13 IST

ఐటీ శాఖ ఆధ్వర్యంలో 10న నిర్వహణ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగులో చాట్‌ జీపీటీ తయారీకి అవసరమైన తెలుగు భాష డేటా సెట్స్‌ సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 10న డేటాథాన్‌ సదస్సు నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో భాగంగా డేటాథాన్‌ ఉంటుందని పేర్కొంది. తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్, టాస్క్, ఐఐఐటీహెచ్, వైల్‌ఓజోన్‌టెల్, డిజిక్వాంట, టెక్‌వేదిక సంస్థలు  సహకరించనున్నాయని, 10న రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు డేటాథాన్‌లో పాల్గొంటారని వివరించింది. తెలుగు భాష, సంస్కృతి వనరులను డేటాథాన్‌ సదస్సు ద్వారా సమీకరించి ఆ సమాచారాన్ని ఐటీశాఖతో కలిసి డిజిటైజ్‌ చేయనున్నారు. సదస్సులో పాల్గొనే విద్యార్థులు, పౌరులు జానపదాలు, పాటలు, స్థానిక ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, ఆహారంపై సమాచారం తీసుకుంటారు. దీని ద్వారా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు డేటా సమీకరణ, ప్రాసెసింగ్, ఏఐ టెక్నాలజీ అప్లికేషన్ల వినియోగంపై నైపుణ్యాలు పెరుగుతాయని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ సమాచార సేకరణకు స్వేచ్ఛ సంస్థ తరపున ఆండ్రాయిడ్‌ ఆధారిత యాప్‌ తీసుకువచ్చామని స్వేచ్ఛ ప్రతినిధి ప్రవీణ్, కిరణ్‌చంద్ర తెలిపారు. ఈ యాప్‌లో మాట్లాడిన విషయాలు టెక్ట్స్‌ రూపంలో నిక్షిప్తమవుతాయన్నారు. తెలుగులో చాట్‌ జీపీటీ ప్రయత్నంలో భాగంగా తాము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు