KTR: డిసెంబర్‌ 9.. చరిత్రాత్మక మైలురాయి.. ట్విటర్‌లో కేటీఆర్‌

తెలంగాణ ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపు తిప్పి 60 సంవత్సరాల ఆకాంక్షలకు సరికొత్త ఊపిరినిచ్చిన చారిత్రాత్మక మైలురాయిగా 2009, డిసెంబరు 9 నిలిచిపోతుందని మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌లో తెలిపారు.

Updated : 10 Dec 2022 08:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపు తిప్పి 60 సంవత్సరాల ఆకాంక్షలకు సరికొత్త ఊపిరినిచ్చిన చారిత్రాత్మక మైలురాయిగా 2009, డిసెంబరు 9 నిలిచిపోతుందని మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌లో తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షకు పూనుకొన్న ఉద్యమ నేత కేసీఆర్‌ ఉక్కుసంకల్పానికి కేంద్రం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసిన రోజు ‘2009, డిసెంబరు 9’ అని ఆయన పేర్కొన్నారు. ఉద్యమ నేతతో దీక్ష విరమింపజేస్తున్న కేసీఆర్‌ సతీమణి శోభ ఫొటోను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌కు జత చేశారు.


ఆ చారిత్రక సందర్భానికి 13 ఏళ్లు: హరీశ్‌

‘‘కేసీఆర్‌ ప్రాణాలను పణంగా పెట్టి 11 రోజుల ఆమరణ దీక్షతో కేంద్రం దిగివచ్చిన రోజు ఇది. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పి, ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన చారిత్రక సందర్భానికి నేటికి 13 ఏళ్లు’’ అని మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ట్విటర్‌లో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని