HYD Metro: గంగారం వద్ద డబుల్‌ డెక్‌ ఫ్లైఓవర్‌ కమ్‌ మెట్రో

హైదరాబాద్‌లో ఎల్బీనగర్‌ సమీపంలోని చింతలకుంట నుంచి హయత్‌నగర్‌ వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల పక్క నుంచి మెట్రోరైలు ఎలైన్‌మెంట్‌ రాబోతోంది.

Published : 11 Jul 2024 03:03 IST

చింతలకుంట-హయత్‌నగర్, బీహెచ్‌ఈఎల్‌ వద్ద ఫ్లైఓవర్ల పక్కనుంచి మెట్రో ఎలైన్‌మెంట్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఎల్బీనగర్‌ సమీపంలోని చింతలకుంట నుంచి హయత్‌నగర్‌ వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల పక్క నుంచి మెట్రోరైలు ఎలైన్‌మెంట్‌ రాబోతోంది. బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతంలోనూ ఫ్లైఓవర్‌ పక్క నుంచి మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇదే మార్గంలో గంగారం వద్ద మాత్రం రెండంచెల (డబుల్‌ డెక్‌) ఫ్లైఓవర్‌ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. బుధవారం బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఇంజినీర్ల బృందం, డీపీఆర్‌ కన్సల్టెన్సీ ఇంజినీరింగ్‌ నిపుణులతో ఎన్‌హెచ్‌ అధికారులు సమావేశమయ్యారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులు ముందే అప్రమత్తమై ఉంటే.. అన్ని మార్గాల్లోనూ డబుల్‌డెక్‌ ఫ్లైఓవర్లకు అవకాశం ఉండేదని.. కింద రహదారి, పైన మెట్రోతో ట్రాఫిక్‌ తిప్పలు తప్పేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని