TG News: రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..

Published : 07 Jul 2024 03:20 IST

అన్నపురెడ్డిపల్లి, న్యూస్‌టుడే: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. అన్నపురెడ్డిపల్లి మండలం జానకీపురం గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య(40) తనకున్న మూడెకరాల పొలంతోపాటు, మరికొంత కౌలుకు తీసుకొని కొంతకాలంగా వరి, పత్తి, మిర్చి పండిస్తున్నారు. దిగుబడులు సరిగా రాకపోవడంతో పూర్తిగా అప్పులపాలయ్యారు. ఇటీవల తన తండ్రి వైద్య ఖర్చుల కోసమూ కొంతమేర అప్పు చేశారు. ఆయన కూడా మృతి చెందారు. ఈ అప్పులు తీర్చే మార్గం కనిపించక లక్ష్మయ్య మనస్తాపానికి గురయ్యారు. శనివారం తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని