Group-1 Mains: గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు 75 రోజులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

Published : 10 Jul 2024 03:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు 75 రోజులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఔత్సాహికులు www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు రూ.5000 ఉపకార వేతనం అందజేస్తారు. హైదరాబాద్‌ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌ (రోడ్‌ నం: 8, లక్ష్మీనగర్‌), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇస్తారు. మరింత సమాచారం కోసం 040-24071188 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు