CORONA: ఆగని మృత్యుకల్లోలం!

దేశంలో కొవిడ్‌ మహమ్మారి ‘మృత్యు’కల్లోలం ఆగడం లేదు. కేసులు, పాజిటివిటీ రేటు కొంత తగ్గుతున్నా మరణాలు మాత్రం తగ్గడం లేదు. 24 గంటల్లో 4,194 మంది చనిపోయారు. ఈనెలలో ఇలా 4 వేలకు పైగా మరణాలు సంభవించడం ఇది 11వ సారి. వివిధ రాష్ట్రాల్లో శనివారం మరణాల సంఖ్య పెరిగింది.

Updated : 23 May 2021 10:15 IST

మళ్లీ 4 వేలు దాటిన కొవిడ్‌ మరణాలు

ఈనాడు, దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి ‘మృత్యు’కల్లోలం ఆగడం లేదు. కేసులు, పాజిటివిటీ రేటు కొంత తగ్గుతున్నా మరణాలు మాత్రం తగ్గడం లేదు. 24 గంటల్లో 4,194 మంది చనిపోయారు. ఈనెలలో ఇలా 4 వేలకు పైగా మరణాలు సంభవించడం ఇది 11వ సారి. వివిధ రాష్ట్రాల్లో శనివారం మరణాల సంఖ్య పెరిగింది. మహారాష్ట్రలో 4 రోజుల వ్యవధిలో రెండోసారి 1,200 మందికి పైగా చనిపోయారు. 24 గంటల్లో మరణాల సంఖ్య తమిళనాడులో 450, కర్ణాటకలో 350, దిల్లీలో 250 దాటిపోయింది. మొత్తం 12 రాష్ట్రాల్లో ఒక్కోచోట వందకుపైగా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 2.57 లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,62,89,290కి చేరింది. మహమ్మారి బారిన పడినవారిలో ఇంతవరకు 2,95,525 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒక్క రోజులో 3,57,630 మంది కోలుకున్నారు. క్రియాశీలక కేసుల్లో 1,04,525 తగ్గుదల నమోదైంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 29,23,400కి తగ్గింది. దేశవ్యాప్తంగా ఇంతవరకు 2,30,70,365 మంది కొవిడ్‌ను జయించారు.  దేశంలో కరోనా పాజిటివిటీ రేటు ఈనెల 10 నాటితో (24.83%) పోలిస్తే శనివారానికి దాదాపు సగం వరకు తగ్గడం కొంత ఊరటనిస్తోంది. తాజాగా రోజువారీ పాజిటివిటీ రేటు 12.45%కి చేరింది. ఇది రోజురోజుకీ తగ్గుతున్నప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 5% కంటే ఇంకా చాలా ఎక్కువగానే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని