EAMCET వాయిదా!

ఎంసెట్‌ వాయిదాపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం జులై 5 నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాలి. ఇంటర్‌ పరీక్షలను జులై 15 తర్వాత జరుపుతామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు లిఖితపూర్వకంగా చెప్పింది

Updated : 29 May 2021 08:11 IST

ఇంటర్‌ పరీక్షలు జరగకపోవడమే కారణం
ఆగస్టులో నిర్వహించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ వాయిదాపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం జులై 5 నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగాలి. ఇంటర్‌ పరీక్షలను జులై 15 తర్వాత జరుపుతామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు లిఖితపూర్వకంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ పరీక్షలు పూర్తికాకుండా ఎంసెట్‌ నిర్వహించడం సమంజసం కాదనే నిర్ణయానికి ఉన్నత విద్యామండలి వచ్చింది. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత 15 రోజుల వ్యవధి ఇచ్చి జరపాలని భావిస్తోంది. దీన్నిబట్టి ఎంసెట్‌ ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ పరీక్షకు ఇప్పటివరకు 2.05 లక్షల దరఖాస్తులు అందాయి.
*ఇదే కాదు జూన్‌ 7వ తేదీ నుంచి జరగాల్సిన పీఈసెట్‌ పోటీలు, జూన్‌ 19-22వ తేదీ వరకు జరిగే పీజీఈసెట్‌, జులై 1న నిర్వహించాల్సిన ఈసెట్‌ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి. డిగ్రీ ఫలితాలతో సంబంధం ఉన్న ఇతర ప్రవేశ పరీక్షల తేదీలు కూడా మారే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

జులై 5 నుంచి సీఏ పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 2021, మే నెలలో జరగాల్సిన సీఏ ఇంటర్‌మీడియట్‌, ఫైనల్‌ పరీక్షలు జులై 5వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) వెల్లడించింది. పూర్తి కాలపట్టికను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని