Biotechnology: బయో బియ్యం వస్తున్నాయ్‌

బయోటెక్నాలజీ విధానంలో అభివృద్ధి చేసిన ఓ రకం బియ్యంలో ఐరన్‌ శాతం అధికంగా ఉన్నట్టు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ

Updated : 16 Jun 2021 10:31 IST

వాటిలో పుష్కలంగా ఐరన్‌!
వరంగల్‌ పరిశోధన స్థానంలో ‘డబ్ల్యూజిఎల్‌1119’ అభివృద్ధి

ఈనాడు, వరంగల్‌ : బయోటెక్నాలజీ విధానంలో అభివృద్ధి చేసిన ఓ రకం బియ్యంలో ఐరన్‌ శాతం అధికంగా ఉన్నట్టు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్సిటీ పరిధిలోని అనేక కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు ఎన్నో వరి వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘డబ్ల్యూజిఎల్‌1119’గా పిలిచే ఈ  వంగడాన్ని ఈ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది.  ఈ బియ్యంలో ఐరన్‌ శాతం పుష్కలంగా ఉండడమే కాదు, వర్షాభావ పరిస్థితులున్నప్పుడు కూడా సాగు చేసేందుకు ఇది అనువుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 115 రోజుల స్పల్పకాలిక రకమైన దీని గింజ బీపీటీలా సన్నగా ఉండడమే కాక, ఉల్లికోడు తెగులును సైతం తట్టుకుంటుందని... ఎకరానికి 6.5 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుందని వారు చెబుతున్నారు. కిలో బియ్యంలో 21.03 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉన్నట్టు కనుగొన్నామని ఈ పరిశోధనలో కీలకంగా పనిచేస్తున్న బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్‌ వై.హరి వివరించారు. రెండో సంవత్సరం చిరుసంచుల ప్రదర్శన దశలో ఉన్న ఈ వంగడం విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వరంగల్‌ ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ రావుల ఉమారెడ్డి తెలిపారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని