Yadadri: యాదాద్రిలో పూజలు, ప్రసాదాల ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు నిర్వహించే శాశ్వత, నిత్య పూజలతో పాటు, ప్రసాదాల ధరలు పెరిగాయి. ఈ మేరకు కార్యనిర్వహణ అధికారి గీత

Updated : 10 Dec 2021 08:53 IST

కొవిడ్‌తో ఆదాయం కుంటుపడడమే కారణమన్న ఈవో

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు నిర్వహించే శాశ్వత, నిత్య పూజలతో పాటు, ప్రసాదాల ధరలు పెరిగాయి. ఈ మేరకు కార్యనిర్వహణ అధికారి గీత గురువారం ఆదేశాలు జారీ చేశారు. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆరేళ్లుగా పూజలు, ప్రసాదాల ధరలు పెంచలేదని వివరించారు. కొవిడ్‌ కారణంగా ఆలయ ఆదాయం కుంటుపడిందని, జీతభత్యాలతో ఆర్థికభారం పెరిగిన దృష్ట్యా ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అనుబంధ ఆలయాల్లోనూ పెరిగిన ధరలు వర్తిస్తాయని వివరించారు.

పెంపుదల ఇలా..

వీవీఐపీలు సత్యనారాయణ వ్రతాన్ని ప్రత్యేకంగా జరుపుకొనేందుకు అవకాశం కల్పిస్తూ టికెట్‌ ధరను రూ. 1,500గా నిర్ణయించారు. ఇంతకుముందు ఈ టికెట్‌ లేదు. లక్ష్మీనారసింహుల నిత్యకల్యాణం టికెట్‌ ధర రూ. 1,250 నుంచి రూ. 1,500కు పెరిగింది. నిజాభిషేకానికి రూ.500 నుంచి రూ.800కు, సుదర్శన హోమం రూ.1,116 నుంచి రూ. 1,250కి, సువర్ణ పుష్పార్చన రూ. 516 నుంచి రూ. 600, వేదాశీర్వచనం రూ. 516 నుంచి రూ. 600, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవ రూ. 750 నుంచి రూ. 1,000, సత్యనారాయణ వ్రతం (సామగ్రితో కలిపి) రూ. 500 నుంచి రూ. 800, స్వామివారికి అష్టోత్తరం టికెట్‌ ధరను రూ. 100 నుంచి రూ. 200కి పెంచారు. 100 గ్రాముల లడ్డూ ధర రూ. 20నుంచి రూ. 30, 500 గ్రాముల లడ్డూ ధర రూ. 100 నుంచి రూ. 150, 250 గ్రాముల పులిహోర ప్యాకెట్‌ ధర రూ. 15 నుంచి రూ. 20, 250 గ్రాముల వడ రూ.15 నుంచి రూ.20కి పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని