IRCTC: ఐఆర్‌సీటీసీ సరి‘కొత్త’ యాత్రలు

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే.. కొత్త సంవత్సరంలో సరికొత్త రైలు యాత్రలకు ఐఆర్‌సీటీసీ శ్రీకారం చుట్టింది. ఉత్తర, దక్షిణ భారత యాత్రలతో పాటు తిరుమల దర్శనమూ ఇందులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ గ్రూప్‌

Updated : 01 Jan 2022 09:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే.. కొత్త సంవత్సరంలో సరికొత్త రైలు యాత్రలకు ఐఆర్‌సీటీసీ శ్రీకారం చుట్టింది. ఉత్తర, దక్షిణ భారత యాత్రలతో పాటు తిరుమల దర్శనమూ ఇందులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ డి.నర్సింగరావు తెలిపారు. సోమనాథ్‌, ద్వారక, నాగీశ్వర్‌, బెట్‌ ద్వారక, అహ్మదాబాద్‌, స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ దర్శించేలా ‘వైబ్రెంట్‌ గుజరాత్‌’ పేరిట జనవరి 21న 11 రోజుల యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుని ఈ రైలు బయల్దేరుతుందన్నారు.

* ‘భారత్‌ దర్శన్‌’ పేరిట గోవా-హంపి యాత్ర ఫిబ్రవరి 12 నుంచి 7 రోజుల పాటు ఉంటుంది.. ఈ రైలు అనకాపల్లి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌, సికింద్రాబాద్‌ మీదుగా సాగుతుంది.

* మాతా వైష్ణోదేవి దర్శనంతో పాటు.. ‘ఉత్తర భారత దర్శన్‌’ పేరిట మార్చి 19 నుంచి 9 రోజుల పాటు యాత్ర సాగుతుంది. రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని, విశాఖపట్నం, విజయనగరం, సామర్లకోట మీదుగా రైలు సాగుతుంది.

* 3 రోజుల తిరుమల-తిరుచానూర్‌-తిరుపతి యాత్ర రోజూ హైదరాబాద్‌ నుంచి, ప్రతి శుక్రవారం విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట నుంచి ఉంటుంది. 4 రోజుల కాణిపాకం-శ్రీకాళహస్తి-తిరుమల-తిరుచానూర్‌ యాత్ర రోజూ హైదరాబాద్‌ నుంచి, ప్రతి గురువారం కరీంనగర్‌ నుంచి ఆరంభమవుతుంది.

* 6 రోజుల మురుడేశ్వర-శృంగేరి-ఉడిపి సందర్శనతో ఏర్పాటుచేసిన ‘కోస్టల్‌ కర్ణాటక’ యాత్ర, ధర్మశాల-మంగళూరు, శృంగేరి, ఉడిపి ప్రాంతాల సందర్శనతో ‘డివైన్‌ కర్ణాటక’ యాత్ర, కూర్గ్‌-మంగళూరు ప్రాంతాల సందర్శనతో ‘కాఫీ విత్‌ కర్ణాటక’ యాత్ర ప్రతి మంగళవారం హైదరాబాద్‌ నుంచి ఉంటుంది.

* ప్యాకేజీల పూర్తి వివరాలకు.. ఫోన్లు: 040-27702407, 970136071 లేదా ఐఆర్‌సీటీసీ టూరిజం.కామ్‌  చూడవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని