Union Budget 2022: ఇక ఇంట్లోనే ‘టీవీ’ మాస్టారు

ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్‌.. ప్రాంతీయ భాషల్లో పాఠాలు... కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదన ఇది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఒక్కో తరగతికి ఒకటి చొప్పున 12 ఛానళ్లు ప్రారంభిస్తామని గత బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. స్వయంప్రభ

Updated : 02 Feb 2022 07:58 IST

 రాష్ట్రానికి 3 లేదా 4 ఛానళ్లు కేటాయించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్‌.. ప్రాంతీయ భాషల్లో పాఠాలు... కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదన ఇది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఒక్కో తరగతికి ఒకటి చొప్పున 12 ఛానళ్లు ప్రారంభిస్తామని గత బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. స్వయంప్రభ పేరిట వాటిని అందుబాటులోకి తెచ్చింది. వాటిని 200కు పెంచుతామని తాజా బడ్జెట్లో ప్రకటించింది. అంటే మరో 188 కొత్తగా రానున్నాయి. దేశంలో హిందీ సహా మొత్తం 22 అధికార భాషలున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి మూడు లేదా నాలుగు డీటీహెచ్‌ ఛానళ్లు కేటాయించే అవకాశముందని టీశాట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దూరదర్శన్‌ యాదగిరితోపాటు టీశాట్‌ కింద విద్య, నిపుణ ఛానళ్లు ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పాఠాలకు వీటిలో స్లాట్లు దొరకడం ఇబ్బందిగా మారింది. మరికొన్ని ఛానళ్లు వస్తే ఈ సమస్య తీరనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని