TSRTC: గరుడ ప్లస్‌ ఛార్జీలను తగ్గించిన ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్‌ ఏసీ బస్సు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని బస్సు ఛార్జీతో గరుడ ప్లస్‌ బస్సులో ప్రయాణం చేయవచ్చు. ఈ వెసులుబాటు ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు కల్పించామన్నారు

Updated : 11 Feb 2022 08:05 IST

 మార్చి 31వ తేదీ వరకు వెసులుబాటు

హైదరాబాద్‌-బెంగళూరు మార్గంలో వర్తించదు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ గరుడ ప్లస్‌ ఏసీ బస్సు ఛార్జీలను తగ్గిస్తున్నట్లు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని బస్సు ఛార్జీతో గరుడ ప్లస్‌ బస్సులో ప్రయాణం చేయవచ్చు. ఈ వెసులుబాటు ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు కల్పించామన్నారు. కర్ణాటక ఆర్టీసీతో సమానంగా అమలు చేస్తున్న ఫ్లెక్సీ ఛార్జీల విధానం అమలులో ఉన్న హైదరాబాద్‌-బెంగళూరు మార్గానికి ఈ వెసులుబాటు వర్తించదన్నారు. నూతన వెసులుబాటుతో హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఛార్జీ రూ.వంద తగ్గుతుంది. హైదరాబాద్‌-ఆదిలాబాద్‌ మధ్య రూ.111, హైదరాబాద్‌-భద్రాచలం మధ్య రూ.121, హైదరాబాద్‌-వరంగల్‌ మధ్య రూ.54 ఛార్జీ తగ్గుతుంది. రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని మెరుగైన సేవలు అందించేందుకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు సజ్జనార్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని