దేశంలో ఓటర్లు 95,24,81,459

దేశంలో ఓటర్ల సంఖ్య 95,24,81,459కి చేరింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం 2022 ఓటర్ల జాబితాను విడుదల చేసింది. గత జాబితా (2020)తో పోలిస్తే తాజాగా ఓటర్ల సంఖ్య 3,26,96,445 మేర పెరిగింది. ఓటర్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య 6.79%

Published : 14 Feb 2022 04:30 IST

 9 రాష్ట్రాలు/యూటీల్లో మహిళా ఓటర్లు ఎక్కువ

 2022 జాబితా విడుదల

ఈనాడు, దిల్లీ: దేశంలో ఓటర్ల సంఖ్య 95,24,81,459కి చేరింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం 2022 ఓటర్ల జాబితాను విడుదల చేసింది. గత జాబితా (2020)తో పోలిస్తే తాజాగా ఓటర్ల సంఖ్య 3,26,96,445 మేర పెరిగింది. ఓటర్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య 6.79% అధికంగా ఉంది. రాష్ట్రాలకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉండగా.. సిక్కింలో అతి తక్కువగా ఉన్నారు. తాజా జాబితా విశేషాలివి..

* దేశంలో 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో (యూటీలు) పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అవి పుదుచ్చేరి, కేరళ, మణిపుర్‌, మిజోరం, గోవా, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌. మిగిలిన అన్ని రాష్ట్రాలు, యూటీల్లోనూ పురుష ఓటర్లే అధికం.

* మొత్తంగా ప్రవాస ఓటర్లు 1,22,200; సర్వీసు ఓటర్లు 19,12,708 మంది ఉన్నారు.

* తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 15,05,83,879కి చేరింది. సిక్కింలో 4,46,262 మంది ఓటర్లున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఓటర్ల సంఖ్య 56,269 మాత్రమే.

* ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉంది. ప్రవాస ఓటర్లు అత్యధికంగా కేరళలో (92,486) నమోదయ్యారు. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(7,065), ఆంధ్రప్రదేశ్‌(7,033)లు ఉన్నా యి. అత్యధిక సర్వీసు ఓటర్లున్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ (2,98,746) తొలిస్థానాన్ని ఆక్రమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని