KTR: మళ్లీ ఆంధ్రలో కలిపేస్తారేమో!

కేంద్ర ప్రభుత్వం గత ఏడున్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీ రామారావు సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్‌లో రూ. 126 కోట్లతో నిర్మించనున్న జలాశయానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం

Updated : 17 Feb 2022 06:32 IST

కేంద్రంపై మండిపడిన మంత్రి కేటీఆర్‌
తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని సవాల్‌
మోదీ ఉత్తర భారత ప్రధానిగా వ్యవహరిస్తున్నారని ధ్వజం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: కేంద్ర ప్రభుత్వం గత ఏడున్నరేళ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీ రామారావు సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్‌లో రూ. 126 కోట్లతో నిర్మించనున్న జలాశయానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం మంచిది కాదని భాజపాను ఉద్దేశించి పేర్కొన్నారు. నాలుగు రోజులు ఏమరుపాటుగా ఉంటే తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపినా కలుపుతారు.. యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. నరేంద్రమోదీ ఉత్తర భారతదేశానికి, ఉత్తర్‌ప్రదేశ్‌కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆరోపించారు. గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయమంటే.. వాట్సప్‌ యూనివర్సిటీ తీసుకొచ్చారని చమత్కరించారు. కర్ణాటకలోని అప్పర్‌ భద్రపై చిన్న ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇస్తున్న కేంద్రం రాష్ట్రంలోని పాలమూరు, కాళేశ్వరం వంటి వాటిపై వివక్ష చూపుతోందన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌ కంటే బాన్సువాడలోనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఎక్కువగా చేపట్టామన్నారు. చిన్న గిరిజన తండా సిద్దాపూర్‌లో 30 ఇళ్ల నిర్మాణం జరుగుతుండటం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీపాటిల్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సురేందర్‌, షకీల్‌, హన్మంత్‌ శిండే, గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, మహిళా కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ ఆకుల లలిత, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ విఠల్‌రావు, డీసీసీబీ ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని