Telangana News: యాదాద్రిలో మహాయాగం వాయిదా

యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగంగా వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీసుదర్శన నారసింహ మహాయాగం....

Updated : 19 Feb 2022 07:56 IST

కట్టడాలు పూర్తికాకపోవడమే కారణం

ముందస్తు నిర్ణయం ప్రకారమే మార్చి 28 నుంచి మూలవరుల దర్శనం

యాడా వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు వెల్లడి

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగంగా వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదా వేస్తున్నట్లు యాడా వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు వెల్లడించారు. యాగశాల ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ఆయనతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిపారు. ‘‘మహాయాగం నిర్వహణ వాయిదా పడింది. క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికానందునే వాయిదా వేశాం. ఆలయ ఉద్ఘాటన తరువాత నిర్వహించే అవకాశాలున్నాయి. యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు కానుంది. మూలవరుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉంటుంది. మహాకుంభ సంప్రోక్షణ పర్వం చేపట్టి ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తాం. ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పంచనారసింహుల ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు, భక్తుల ఆర్జిత సేవలు సాగుతున్న బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగిస్తాం’’ అని కిషన్‌రావు తెలిపారు. ఈ నెలాఖరులో ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన చేపట్టనున్నట్లు ఈవో గీత తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని