Updated : 20 Feb 2022 05:19 IST

Medaram Jathara: కోలాహలంగా దేవతల వనప్రవేశం

ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: మేడారంలో శనివారం ఆదివాసీల ఆరాధ్య దేవతల వనప్రవేశం కోలాహలంగా జరిగింది. తరలివచ్చిన అశేషభక్తజనం, జిల్లా యంత్రాంగం, పోలీసుల పర్యవేక్షణలో పూజారులు ఈ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల పాటు భక్తులకు దీవెనలందించిన దేవతలను తీసుకెళ్తున్న వేళ గద్దెల ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. తొలుత పగిడిద్దరాజును తీసుకొని 7.17 గంటలకు పూజారి పెనక బుచ్చిరాములు మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు బయలుదేరారు. కొక్కె కృష్ణయ్య 7.19 గంటలకు సమ్మక్క తల్లిని తీసుకుని చిలకలగుట్టకు వెళ్లారు. పూజారులు దబ్బకట్ల గోవర్ధన్‌, జనార్దన్‌రావు తదితరులు గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి తీసుకెళ్లారు. కాక సారయ్య 7.25 గంటలకు సారలమ్మను తీసుకొని కన్నెపల్లికి బయల్దేరారు. దీంతో వనప్రవేశం ముగిసింది.

కొనసాగిన రద్దీ..

జాతర ఆఖరి రోజు శనివారం కూడా రద్దీ కొనసాగింది. అధిక సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. దర్శనాల లైన్లలో భక్తులు పోటెత్తారు. రెండేళ్ల తర్వాత తిరిగి మహాజాతర జరగనుంది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని