Telangana News: ఎమ్మెల్యే అల్లుడు x మేయర్‌ భర్త

స్థల వివాద విషయంలో బుధవారం రాత్రి నిజామాబాద్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ ఛైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అల్లుడు మోటాడి సంపత్‌.. నగర పాలక సంస్థ మేయర్‌ నీతూ

Updated : 03 Mar 2022 08:15 IST

నిజామాబాద్‌లో స్థల వివాదం
బాజిరెడ్డి అల్లుడి వాహనంపై దాడి
అతడి స్నేహితుడి నిర్బంధం

ఈనాడు, నిజామాబాద్‌: స్థల వివాద విషయంలో బుధవారం రాత్రి నిజామాబాద్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ ఛైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అల్లుడు మోటాడి సంపత్‌.. నగర పాలక సంస్థ మేయర్‌ నీతూ కిరణ్‌ భర్త దండుశేఖర్‌ల మధ్య ఈ వ్యవహారం నడిచింది. సంపత్‌ అలియాస్‌ పింటు వాహనంపై బుధవారం మధ్యాహ్నం దాడి జరిగింది. అతడి స్నేహితుడైన వెంకట్‌యాదవ్‌పై కూడా కొందరు దాడి చేసి నిర్బంధించారు. తన స్నేహితుడు వెంకట్‌పై మేయర్‌ భర్త దండు శేఖర్‌ సహా మరికొందరు దాడి చేశారని సంపత్‌ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తనపైనా రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మేయర్‌ భర్త దండు శేఖర్‌ సహా మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు వెల్లడించారు. అరగంట తర్వాత కేసు నమోదు చేయలేదంటూ సమాచారం ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లు, ఇరువర్గాలు అధికార పార్టీ వారు కావడంతో చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

అసలేం జరిగింది..

పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌ సాయినగర్‌లో ఎమ్మెల్యే అల్లుడు సంపత్‌కు 2400 గజాల స్థలం ఉంది. ఈ భూమిని చదును చేయించి హద్దు రాళ్లు పాతించే పనులు జరుగుతున్నాయి. ఇదే ప్రాంతంలో తనకు కూడా 300 గజాల భూమి ఉందని సంపత్‌కు మేయర్‌ భర్త దండు శేఖర్‌ ఫోన్‌ చేశారు. తను భూమి దగ్గరే ఉన్నానని చెప్పడంతో తన మిత్రుడైన వెంకట్‌ ను సంపత్‌ అక్కడికి పంపారు. వెంకట్‌ వెళ్లేసరికి మేయర్‌ భర్త లేరు. అక్కడున్న కొందరు వెంకట్‌పై దౌర్జన్యం చేసి నిర్బంధించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సంపత్‌ కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆయన వాహనం దిగకుండానే వెళ్లిపోయారు. సంపత్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వెంకట్‌ను విడిపించారు. మేయర్‌ భర్త కూడా అప్పుడు అక్కడికి వచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా సాయంత్రం ఇరువర్గాల ఘర్షణచిత్రాలు బయటకొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని