Mobile Data: మొబైల్‌ డేటా లేకుండానే ఇంటర్‌నెట్‌

మొబైల్‌ డేటా లేకుండానే ప్రజలకు ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా పబ్లిక్‌ డేటా ఆఫీసుల (పీడీవో)ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీవోటీ) ఏర్పాటు

Published : 04 Mar 2022 07:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: మొబైల్‌ డేటా లేకుండానే ప్రజలకు ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా పబ్లిక్‌ డేటా ఆఫీసుల (పీడీవో)ను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ (డీవోటీ) ఏర్పాటు చేస్తోంది. ‘పీఎం వాణి (పబ్లిక్‌ వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ ఫేజ్‌) ప్రాజెక్ట్‌’ కింద దేశంలో లక్షలాది వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటులో భాగంగా పీడీవోలను నెలకొల్పుతున్నారు. గ్రామీణ ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్‌లోని డీవోటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఎం వాణి బిజినెస్‌ ప్రమోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల టెలికం సలహాదారుడు అశోక్‌కుమార్‌ గురువారం ప్రారంభించారు. పీడీవోలను ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకు వైఫై సెట్‌ టాప్‌ బాక్స్‌లను రూ.3 వేల నుంచి రూ.12 వేలకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (టెక్నికల్‌) కె.రాజశేఖర్‌ తెలిపారు. డీవోటీ డిప్యూటీ డైరెక్టర్‌ (పరిపాలన) జె.రాజారెడ్డి మాట్లాడుతూ.. దీన్ని వినియోగించుకునేందుకు పీఎం వాణి యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని