NEET 2022: జూన్‌లో నీట్‌ 2022.. వచ్చే వారంలో ప్రకటన

వైద్యవిద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)-2022 ఈ ఏడాది జూన్‌లో జరిగే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేయడానికి నేషనల్‌ టెస్టింగ్‌

Published : 07 Mar 2022 07:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యవిద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)-2022 ఈ ఏడాది జూన్‌లో జరిగే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేయడానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సన్నాహాలు చేస్తోంది. గత రెండేళ్లుగా కొవిడ్‌ ప్రభావంతో నీట్‌ నిర్వహణ ఆలస్యమవుతూ వస్తోంది. 2021-22 విద్యాసంవత్సరంలో ఇప్పటివరకూ రెండో విడత ప్రవేశ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దీనిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదైనా నిర్ణీత సమయానికి నీట్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని